Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Monday, September 23, 2013

యెషయా9

Isa 9:1  అయినను వేదనపొందిన దేశముమీద మబ్బు నిలువ లేదు పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను అంత్యకాలమున ఆయన సముద్రప్రాంతమును, అనగా యొర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు. 
Isa 9:2  చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచు చున్నారు మరణచ్ఛాయగల దేశనివాసులమీద వెలుగు ప్రకా శించును. 
Isa 9:3  నీవు జనమును విస్తరింపజేయుచున్నావు వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు కోతకాలమున మనుష్యులు సంతోషించునట్లు దోపుడుసొమ్ము పంచుకొనువారు సంతోషించునట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. 
Isa 9:4  మిద్యాను దినమున జరిగినట్లు వాని బరువు కాడిని నీవు విరిచియున్నావు వాని మెడను కట్టుకఱ్ఱను వాని తోలువాని కొరడాలను విరిచియున్నావు. 
Isa 9:5  యుద్ధపుసందడిచేయు యోధులందరి జోళ్లును రక్తములో పొరలింపబడిన వస్త్రములును అగ్నిలో వేయబడి దహింపబడును. 
Isa 9:6  ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. 
Isa 9:7  ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమ మును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయమువలనను నీతివలనను రాజ్యమును స్థిరపరచు టకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును. సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తికలిగి దీనిని నెరవేర్చును. 
Isa 9:8  ప్రభువు యాకోబు విషయమై వర్తమానము పంపగా అది ఇశ్రాయేలువరకు దిగివచ్చియున్నది. 
Isa 9:9  అది ఎఫ్రాయిముకును షోమ్రోను నివాసులకును ప్రజల కందరికి తెలియవలసియున్నది. 
Isa 9:10  వారుఇటికలతో కట్టినది పడిపోయెను చెక్కిన రాళ్లతో కట్టుదము రండి; రావికఱ్ణతో కట్టినది నరకబడెను, వాటికి మారుగా దేవదారు కఱ్ఱను వేయుదము రండని అతిశయపడి గర్వముతో చెప్పుకొనుచున్నారు. 
Isa 9:11  యెహోవా వానిమీదికి రెజీనునకు విరోధులైన వారిని హెచ్చించుచు వాని శత్రువులను రేపుచున్నాడు. 
Isa 9:12  తూర్పున సిరియాయు పడమట ఫిలిష్తీయులును నోరు తెరచి ఇశ్రాయేలును మింగివేయవలెనని యున్నారు ఈలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు. ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది. 
Isa 9:13  అయినను జనులు తమ్ము కొట్టినవానితట్టు తిరుగుట లేదు సైన్యములకధిపతియగు యెహోవాను వెదకరు. 
Isa 9:14  కావున యెహోవా ఇశ్రాయేలులోనుండి తలను తోకను తాటికమ్మను రెల్లును ఒక్క దినమున కొట్టివేయును. 
Isa 9:15  పెద్దలును ఘనులును తల; కల్లలాడు ప్రవక్తలు తోక. 
Isa 9:16  ఈ జనుల నాయకులు త్రోవ తప్పించువారు వారిని వెంబడించువారు వారిచేత మింగివేయబడు దురు. 
Isa 9:17  వారందరును భక్తిహీనులును దుర్మార్గులునై యున్నారు ప్రతి నోరు దుర్భాషలాడును కాబట్టి ప్రభువు వారి యౌవనస్థులను చూచి సంతో షింపడు వారిలో తలిదండ్రులు లేనివారియందైనను వారి విధవరాండ్రయందైనను జాలిపడడు. ఈలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది. 
Isa 9:18  భక్తిహీనత అగ్నివలె మండుచున్నది అది గచ్చపొదలను బలురక్కసి చెట్లను కాల్చి అడవి పొదలలో రాజును అవి దట్టమైన పొగవలె చుట్టుకొనుచు పైకి ఎగయును. 
Isa 9:19  సైన్యముల కధిపతియగు యెహోవా ఉగ్రతవలన దేశము కాలిపోయెను. జనులును అగ్నికి కట్టెలవలె నున్నారు వారిలో ఒకనినొకడు కరుణింపడు. 
Isa 9:20  కుడిప్రక్కన ఉన్నదాని పట్టుకొందురు గాని ఇంకను ఆకలిగొని యుందురు; ఎడమప్రక్కన ఉన్నదాని భక్షించుదురు గాని ఇంకను తృప్తిపొందక యుందురు వారిలో ప్రతివాడు తన బాహువును భక్షించును 
Isa 9:21  మనష్షే ఎఫ్రాయిమును ఎఫ్రాయిము మనష్షేను భక్షించును వీరిద్దరు ఏకీభవించి యూదామీద పడుదురు. ఈలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది. 

No comments:

Post a Comment