Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Monday, September 23, 2013

యెషయా17

Isa 17:1  దమస్కును గూర్చిన దేవోక్తి 
Isa 17:2  దమస్కు పట్టణము కాకపోవలసివచ్చెను అది పాడై దిబ్బగానగును అరోయేరు పట్టణములు నిర్మానుష్యములగును అవి గొఱ్ఱల మందలు మేయు తావులగును ఎవడును వాటిని బెదరింపకుండ మందలు అచ్చట పండుకొనును. 
Isa 17:3  ఎఫ్రాయిమునకు దుర్గము లేకపోవును దమస్కునకు రాజ్యము లేకుండును ఇశ్రాయేలీయుల ప్రభావమునకు జరిగినట్లు సిరియాలో నుండి శేషించినవారికి జరుగును సైన్యములకధిపతియగు యెహోవా ఈ మాట సెల విచ్చుచున్నాడు. 
Isa 17:4  ఆ దినమున యాకోబుయొక్క ప్రభావము క్షీణించి పోవును వాని క్రొవ్విన శరీరము కృశించిపోవును 
Isa 17:5  చేను కోయువాడు దంట్లు పట్టుకొనగా వాని చెయ్యి వెన్నులను కోయునట్లుండును రెఫాయీము లోయలో ఒకడు పరిగె యేరునట్లుం డును 
Isa 17:6  అయినను ఒలీవచెట్లు దులుపగా పైకొమ్మ చివరను రెండు మూడు పండ్లు మిగిలియుండునట్లు ఫలభరితమైన చెట్టున వాలు కొమ్మలయందు మూడు నాలుగు పండ్లు మిగిలియుండునట్లుదానిలో పరిగె పండ్లుండునని ఇశ్రాయేలీయుల దేవు డైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. 
Isa 17:7  ఆ దినమున వారు తమ చేతులు చేసిన బలిపీఠముల తట్టు చూడరు దేవతాస్తంభమునైనను సూర్య దేవతా ప్రతిమలనైనను తమ చేతులు చేసిన దేనినైనను లక్ష్యము చేయరు. 
Isa 17:8  మానవులు తమ్మును సృష్టించినవానివైపు చూతురు వారి కన్నులు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టును 
Isa 17:9  ఆ దినమున ఎఫ్రాయిమీయుల బలమైన పట్టణములు ఇశ్రాయేలీయుల భయముచేత అడవిలోను కొండ శిఖరముమీదను జనులు విడిచిపోయిన స్థలముల వలె నగును. ఆ దేశము పాడగును 
Isa 17:10  ఏలయనగా నీవు నీ రక్షణకర్తయగు దేవుని మరచిపోతివి నీ ఆశ్రయదుర్గమైన నీ శైలమును జ్ఞాపకము చేసికొన లేదు అందుచేత నీవు రమ్యమైన వనములను నాటుచు వచ్చి తివి వాటిలో అన్యమైన ద్రాక్షావల్లులను నాటితివి 
Isa 17:11  నీవు నాటిన దినమున దాని చుట్టు కంచె వేసితివి ప్రొద్దుననే నీవు వేసిన విత్తనములను పుష్పింప జేసితివి గొప్ప గాయములును మిక్కుటమైన బాధయు కలుగు దినమున పంట కుప్పలుగా కూర్చబడును. 
Isa 17:12  ఓహో బహు జనములు సముద్రముల ఆర్భాటమువలె ఆర్భటించును. జనములు ప్రవాహజలముల ఘోషవలె ఘోషించును 
Isa 17:13  జనములు విస్తారజలముల ఘోషవలె ఘోషించును ఆయన వారిని బెదరించును వారు దూరముగా పారిపోవుదురు కొండమీది పొట్టు గాలికి ఎగిరిపోవునట్లు తుపాను ఎదుట గిరగిర తిరుగు కసువు ఎగిరిపోవునట్లు వారును తరుమబడుదురు. 
Isa 17:14  సాయంకాలమున తల్లడిల్లుదురు ఉదయము కాకమునుపు లేకపోవుదురు ఇదే మమ్మును దోచుకొనువారి భాగము, మా సొమ్ము దొంగిలువారికి పట్టు గతి యిదే. 

No comments:

Post a Comment