Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Monday, September 23, 2013

యెషయా22

Isa 22:1  దర్శనపులోయను గూర్చిన దేవోక్తి 
Isa 22:2  ఏమివచ్చి నీలోనివారందరు మేడలమీది కెక్కి యున్నారు? అల్లరితో నిండి కేకలువేయు పురమా, ఉల్లాసముతో బొబ్బలు పెట్టు దుర్గమా, నీలో హతులైనవారు ఖడ్గముచేత హతముకాలేదు యుద్ధములో వధింపబడలేదు. 
Isa 22:3  నీ అధిపతులందరు కూడి పారిపోగా విలుకాండ్లచేత కొట్టబడకుండ పట్టబడినవారైరి. మీలో దొరికినవారందరు పట్టబడి దూరమునకు పారిపోయిరి 
Isa 22:4  నేను సంతాపము కలిగి యేడ్చుచున్నాను నాకు విముఖులై యుండుడి నా జనమునకు కలిగిన నాశనమునుగూర్చి నన్ను ఓదార్చుటకు తీవరపడకుడి. 
Isa 22:5  దర్శనపు లోయలో సైన్యములకధిపతియు ప్రభువు నగు యెహోవా అల్లరిదినమొకటి నియమించి యున్నాడు ఓటమి త్రొక్కుడు కలవరము ఆయన కలుగజేయును ఆయన ప్రాకారములను పడగొట్టగా కొండవైపు ధ్వని వినబడును. 
Isa 22:6  ఏలాము యోధులను రథములను రౌతులను సమకూర్చి అంబులపొదిని వహించియున్నది. కీరు డాలు పై గవిసెన తీసెను 
Isa 22:7  అందుచేత అందమైన నీ లోయలనిండ రథములున్నవి గుఱ్ఱపురౌతులు గవినియొద్ద వ్యూహమేర్పరచుకొను చున్నారు. 
Isa 22:8  అప్పుడు యూదానుండి ఆయన ముసుకు తీసివేసెను ఆ దినమున నీవు అరణ్యగృహమందున్న ఆయుధము లను కనిపెట్టితివి. 
Isa 22:9  దావీదుపట్టణపు ప్రాకారము చాలామట్టుకు పడి పోయినదని తెలిసికొని దిగువనున్న కోనేటి నీళ్లను మీరు సమకూర్చితిరి. 
Isa 22:10  యెరూషలేము యిండ్లను లెక్కపెట్టి ప్రాకారమును గట్టిచేయుటకు ఇండ్లను పడగొట్టితిరి 
Isa 22:11  పాత కోనేటినీళ్లు నిలుచుటకు ఆ రెండు గోడల మధ్యను చెరువు కట్టితిరి అయినను దాని చేయించిన వానివైపు మీరు చూచిన వారు కారు పూర్వకాలమున దాని నిర్మించినవానిని మీరు లక్ష్య పెట్టకపోతిరి. 
Isa 22:12  ఆ దినమున ఏడ్చుటకును అంగలార్చుటకును తలబోడి చేసికొనుటకును గోనెపట్ట కట్టుకొనుటకును సైన్యములకధిపతియు ప్రభువునగు యెహోవా మిమ్మును పిలువగా 
Isa 22:13  రేపు చచ్చిపోదుము గనుక తిందము త్రాగుదము అని చెప్పి, యెడ్లను వధించుచు గొఱ్ఱలను కోయుచు మాంసము తినుచు ద్రాక్షారసము త్రాగుచు మీరు 
Isa 22:14  సంతోషించి ఉత్సహించుదురుఒ కాగా ప్రభువును సైన్యముల కధిపతియునగు యెహోవా నాకు ప్రత్యక్షుడై నాకు వినబడునట్లు ఇట్లనుచున్నాడుమీరు మరణము కాకుండ ఈ మీ దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగదని ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా ప్రమాణ పూర్వకముగా సెలవిచ్చుచున్నాడు. 
Isa 22:15  ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుగృహ నిర్వాహకుడైన షెబ్నా అను ఈ విచారణకర్తయొద్దకు పోయి అతనితో ఇట్లనుము 
Isa 22:16  ఇక్కడ నీ కేమి పని? ఇక్కడ నీ కెవరున్నారు? నీవిక్కడ సమాధిని తొలిపించుకొననేల? ఎత్తయినస్థలమున సమాధిని తొలిపించుకొనుచున్నాడు శిలలో తనకు నివాసము తొలిపించుకొనుచున్నాడు 
Isa 22:17  ఇదిగో బలాఢ్యుడొకని విసరివేయునట్లు యెహోవా నిన్ను వడిగా విసరివేయును ఆయన నిన్ను గట్టిగా పట్టుకొనును 
Isa 22:18  ఆయన నిన్ను మడిచి యొకడు చెండు వేసినట్టు విశాలమైన దేశములోనికి నిన్ను విసరివేయును. నీ యజమానుని ఇంటివారికి అవమానము తెచ్చిన వాడా, అక్కడనే నీవు మృతిబొందెదవు నీ ఘనమైన రథములు అక్కడనే పడియుండును 
Isa 22:19  నీ స్థితినుండి యెహోవానగు నేను నిన్ను తొలగించె దను నీ ఉద్యోగమునుండి ఆయన నిన్ను త్రోసివేయును. 
Isa 22:20  ఆ దినమున నేను నా సేవకుడును హిల్కీయా కుమా రుడునగు ఎల్యాకీమును పిలిచి 
Isa 22:21  అతనికి నీ చొక్కాయిని తొడిగించి నీ నడికట్టుచేత ఆతని బలపరచి నీ అధికారమును అతనికిచ్చెదను; అతడు యెరూషలేము నివాసుల కును యూదా వంశస్థులకును తండ్రియగును. 
Isa 22:22  నేను దావీదు ఇంటితాళపు అధికారభారమును అతని భుజముమీద ఉంచెదను అతడు తీయగా ఎవడును మూయజాలడు అతడు మూయగా ఎవడును తీయజాలడు 
Isa 22:23  దిట్టమైనచోట మేకు కొట్టినట్టు నేను అతని స్థిర పరచెదను అతడు తన పితరులకుటుంబమునకు మాన్యతగల సింహాసనముగా నుండును. 
Isa 22:24  గిన్నెలవంటి పాత్రలను బుడ్లవంటి సమస్తమైన చిన్న చెంబులను అనగా అతని పితరుల సంతాన సంబంధులగు పిల్లజల్ల లందరిని అతనిమీద వ్రేలాడించెదరు. 
Isa 22:25  సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెల విచ్చుచున్నాడు ఆ దినమున దిట్టమైన చోట స్థిరపరచబడిన ఆ మేకు ఊడదీయబడి తెగవేయబడి పడును దానిమీదనున్న భారము నాశనమగును ఈలాగు జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు. 

No comments:

Post a Comment